ఇఫ్తార్ విందులో పాల్గొన్న తిలక్ బాబు
TPT: వైసీపీ పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి, వరదయ్యపాలెం మాజీ సర్పంచ్ తిలక్ బాబు గోవర్ధనపురంలోని మదీనా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ముస్లింలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, వారి అభివృద్ధికి కచ్చితంగా చేస్తానని పేర్కొన్నారు.