గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

CTR: బంగారుపాలెం మండలం తగ్గువారిపల్లి గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ కామరాజు గుండెనొప్పితో చనిపోయారు. ఆయన హెడ్ కానిస్టేబుల్‌గా తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.