పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS అమలు
SDPT: పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని 9 కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో గుమిగూడడాన్ని నిషేధిస్తూ పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ బిఎన్ఎస్ఏస్ 163 విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు ఏప్రిల్ 20–27 వరకు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు అమల్లో ఉంటాయన్నారు. జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.