రాయపర్తిలో రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు
WGL: రాయపర్తి మండలం కొండూరు మార్గంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెరికవేడుకు చెందిన మహమ్మద్ సిద్ధిక్ తన ద్విచక్ర వాహనంపై కాట్రపల్లికి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిద్ధిక్ తీవ్రంగా గాయపడగా, పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.