అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం

అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం

NLG: చందంపేట మండలంలోని ముర్పునూతల అంగన్‌వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రసన్న ఆధ్వర్యంలో బుధవారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలని, ప్రతిరోజు ఆహారంలో ఆకుకూరలు, పాలు, గుడ్లు, పండ్లు ఉండేలా చూసుకోవాలన్నారు. అప్పుడే రక్తహీనత బారిన పడకుండా ఉంటారని తెలిపారు.