నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి

NLG: నకిరేకల్‌లోని రహమత్ నగర్‌కు చెందిన మైనారిటీ నాయకుడు అక్బర్ మౌలానా గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ బుధవారం మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తన సానుభూతిని తెలిపారు.