రేపటి నుంచి కోట సత్తమ్మ దేవస్థానంలో తిరునాళ్ళు

రేపటి నుంచి కోట సత్తమ్మ దేవస్థానంలో తిరునాళ్ళు

EG: నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న శ్రీ కోట సత్తెమ్మ వారి దేవస్థానంలో ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు తిరునాళ్ళు నిర్వహించనున్నట్లు దేవాలయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హరి సూర్య ప్రకాష్ బుధవారం తెలిపారు. 4వ తేదీన ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్ దంపతులు కలశస్థాపన చేస్తారన్నారు. ఏకాదశ రుద్రాభిషేకం, కుంకుమార్చనలు జరుగుతాయని పేర్కొన్నారు.