వేధింపుల ఆరోపణలు.. సీఐ ట్రాన్స్‌ఫర్
KNR: నగరంలోని మహిళ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలతపై వేటు పడింది. భార్యభర్తల గొడవ కేసులో కడారి శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి సెల్పీ వీడియో తీసుకుంటూ.. సీఐ శ్రీలత వేధింపుల వల్లే తాను సూసైడ్ చేసుకుంటున్నానని తెలిపాడు. తన కొడుకు ఆత్మహత్యకు సీఐ వేధింపులే కారణమని శ్రావణ్ తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో శ్రీలతను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.