దొంగలు బీభత్సం.. బంగారం, వెండి చోరీ

దొంగలు బీభత్సం.. బంగారం, వెండి చోరీ

JGL: జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఉపాధి నిమిత్తం ముంబయి వెళ్లిన గాండ్ల తిరుపతి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి, పావు తులం బంగారం, 10 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు రూరల్ SI ఉమాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.