గ్రామంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

KKD: జగ్గంపేట మండలం గోవిందపురంలో శనివారం ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ జక్కంపూడి రాజు మాట్లాడారు. ఆదివాసీ భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని, ఏజెన్సీ వడ్డీ వ్యాపార నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, గిరిజనులకు ఉపాధి హామీ పని దినాలు 200 కల్పించాలన్నారు.