విజేతలకు బహుమతులు అందించిన మంత్రి

విజేతలకు బహుమతులు అందించిన మంత్రి

KKD: కాకినాడ ఎన్టీఆర్ బీచ్‌లో మూడు రోజుల నుంచి జరుగుతున్న మహిళల బీచ్ కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. చిత్తూరు, కృష్ణా జిల్లాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా కృష్ణాజిల్లా జట్టు నిలిచింది. బహుమతి ప్రధానోత్సవానికి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అనంతరం విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు.