బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

MBNR: హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన దెబ్బడి బాలమ్మ, కృష్ణయ్య కుటుంబంలో ఇటీవల జరిగిన మరణంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో అంబేద్కర్ వాదులు, వాట్సాప్ గ్రూపుల ద్వారా సేకరించిన రూ.14,000 లను ఆదివారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గండీడ్ మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం. ఆశన్న, బోరు కృష్ణయ్య పాల్గొన్నారు.