VIDEO: 'స్థానిక ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలి'
KMM: స్థానిక సంస్థల ఎన్నికలకు BRS నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని జడ్పీ మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు పిలుపునిచ్చారు. మంగళవారం చింతకాని మండలం లచ్చగూడెంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.