నటుడు నారాయణమూర్తిని సత్కరించిన ఎమ్మెల్యే

నటుడు నారాయణమూర్తిని సత్కరించిన ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనను ఆయన నివాసంలో శుక్రవారం ప్రముఖ సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. కష్టజీవుల పక్షాన పని చేస్తున్న ఆయన సేవలను అభినందిస్తూ నారాయణ మూర్తిని ఎమ్మెల్యే సత్కరించారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కార్మికులు, రైతులు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై సినిమాలు తీయడం అతని గొప్పతనం అని ఎమ్మెల్యే కొనియాడారు.