రేపు కర్నూలులో జంతువధ నిషేధం
KRNL: గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఆదేశాల మేరకు గురువారం జిల్లాలో జంతువధను నిషేధించినట్లు నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మాంస విక్రయాలు చేపట్టరాదని విక్రయదారులకు సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ట్రేడ్ లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.