బాల్యవివాహాలకు ‘నో’ చెప్పాలి

బాల్యవివాహాలకు ‘నో’ చెప్పాలి

ASR: బాల్యవివాహాల నివారణకు అవగాహన కల్పించేందుకు "10 తరవాత 11 ముద్దు పెళ్లి వద్దు" అనే కార్యక్రమాన్ని కొత్తబలుగూడ బాలికల పాఠశాలలో హ్యూమన్ రైట్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా. కంబిడి కృష్ణకుమారి ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్న వయసులో వివాహం చేసుకోవడం వల్ల బాలికలు మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.