'భారతీనగర్ డివిజన్ అభివృద్ధి పనుల్లో వేగం'

'భారతీనగర్ డివిజన్ అభివృద్ధి పనుల్లో వేగం'

SRD: భారతినగర్ డివిజన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి వేగం పెంచారు. గురువారం కార్పొరేటర్ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ పంకజ్‌ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల GHMC కమిషనర్ కర్ణన్ కి సమర్పించిన ప్రతిపాదనలను అత్యవసరంగా ప్రాసెస్ చేసి తదుపరి ఆమోదం కోసం కమిషనర్ కార్యాలయానికి పంపాలని ఈ సందర్భంగా ఆమె అభ్యర్థించారు.