రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
SKLM: ఆమదాలవలస మండలం ఊసవానిపేట రైల్వే గేటు సమీపంలో రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు శనివారం మృతి చెందారు. ఈ మేరకు జీఆర్‌పీ ఎస్సై ఎం.మధుసూదన్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించామన్నారు. వివరాలకు 9110305494ను సంప్రదించాలని కోరారు.