ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై విచారణ

ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై విచారణ

TG: సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. మరో 3 కేసుల్లో ఆయనను పోలీసులు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు 8 రోజుల పాటు విచారించారు. ఈ 3 కేసుల్లో సైతం ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు. 8 రోజుల కస్టడీ విచారణలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.