'పటేల్ గూడెం మార్గంలో వంతెన నిర్మించాలి'

BHNG: ఆలేరు మండలం కొలనుపాక నుంచి పటేల్ గూడెం పోయే మార్గంలో వంతెన నిర్మించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వివిధ అవసరాల కోసం వందలాది మంది రాకపోకలు సాగిస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాగు పారడంతో రాకపోకలకు ఇబ్బంది జరుగుతుందన్నారు. వర్షాలు పడగానే సమస్య మొదలవుతుందని అన్నారు. ఇకనైనా ఆలేరు ఎమ్మెల్యే స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు.