'ప్రకాశం పంతులుగారి సేవలు ప్రతి తరానికి స్ఫూర్తి'

'ప్రకాశం పంతులుగారి సేవలు ప్రతి తరానికి స్ఫూర్తి'

GNTR: స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. తెలుగువారిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చిన ధీరోదాత్తుడు, త్యాగమూర్తి, తెలుగుజాతి సాహసానికి ప్రతీక అయిన ప్రకాశం పంతులు గారి సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించారు.