తల్లికి తలకొరివి పెట్టిన కూతురు
SKLM: నరసన్నపేట పురుషోత్తం నగర్‌కు చెందిన బొమ్మాలి రాములమ్మ (66) అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. భర్త ముందే మృతి కాగా, కుమారుడు కొంతకాలం క్రితం ఇల్లు విడిచాడు. కుమార్తె రమణమ్మ తన భర్త మరణంతో తల్లితోనే ఉండేది. తల్లికి తలకొరివి పెట్టేందుకు ఎవరూ లేకపోవడంతో చివరకు కుమార్తెనే ఆచారం పూర్తి చేసింది. ఈ దృశ్యం చూసి స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు.