ఈ నెల 14న బాలుర క్రికెట్ జట్టు ఎంపిక
GNTR: ఈ నెల 14న అరండల్ పేటలోని మాజేటి గురవయ్య పాఠశాల క్రీడా మైదానంలో అండర్-12 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం త్రీమెన్ కమిటీ సభ్యులు తెలిపారు. ఆరోజు ఉదయం 7.30 గంటలకు పోటీలు జరుగుతాయి. ఆసక్తిగల క్రీడాకారులు సొంత క్రికెట్ కిట్ బ్యాగ్‌తో హాజరుకావాలి. 2013 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులు.