న్యాయం చేయాలంటూ తహశీల్దార్‌కు మహిళ ఫిర్యాదు
KDP: పోరుమామిళ్ల మండలం గిరి నగర్‌కు చెందిన రాళ్లపల్లె ప్రశాంతి, తన భర్త మధుసూదన్ (వీఆర్ఓ) అదనపు కట్నం కోసం వేధిస్తూ, అక్రమ సంబంధం పెట్టుకుని తనను ఇంట్లో నుంచి గెంటేశారని పోరుమామిళ్ల తహశీల్దార్ ఉదయ్ భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. తమ అత్తమామలు, ఆడపడుచు మానసికంగా వేధిస్తున్నారని, తనను, తన పిల్లలను వదిలేశాడని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.