ఆర్ఎంపీ చికిత్స కేంద్రం సీజ్

GDWL: గట్టు మండలం ఆలూరులో నరసింహ అనే ఆర్ఎంపీ డాక్టర్ నిర్వహిస్తున్న చికిత్స కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. గ్రామంలోని 5 ఏళ్ల చిన్నారికి జ్వరం రాగా వైద్యం కోసం ఆర్ఎంపీని కలిశారు. అతడు హై పవర్ డోస్ ఇవ్వడంతో చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కలెక్టర్ సంతోష్ ఆదేశం మేరకు ఆర్ఎంపీ చికిత్స కేంద్రాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.