ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
AKP: మునగపాక మండలం పాటిపల్లి మోడల్ స్కూల్‌ల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి గురువారం తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులలో ఒక్కొక్క విభాగానికి 40 సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.