సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

ASR: భారీ వర్షాల కారణంగా గోదావరి, శబరి నదుల ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. చింతూరు ఐటీడీఏ, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి ప్రమాదం జరిగినా 8121729228, 9490026397 నెంబర్లకు సమాచారం అందించాలన్నారు. తక్షణ సహాయం అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు.