గ్రామ దేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే
పార్వతీపురం మండలం అంటివలస గ్రామంలో సోమ, మంగళ, బుధవారాల్లో జరుగుతున్న అమ్మవార్ల జాతరలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పాల్గొన్నారు. టీడీపీ నాయకులతో ఇవాళ ఎమ్మెల్యే కలిసి ఆ గ్రామంలో పర్యటించారు. అనంతరం గ్రామదేవతలు శ్రీ నొప్పుల పోలమ్మ, శ్రీ పురటాలమ్మ, శ్రీ బంగారమ్మ, శ్రీ దేశీ తల్లి, శ్రీ నీలావడి తల్లి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.