ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో సహకార వారోత్సవాలు
KDP: ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో ఇవాళ సహకార వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీవో వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ.. దేశ మొదటి ప్రధాని నెహ్రూ సహకార రంగాన్ని అభివృద్ధి చేశారన్నారు. సహకార రంగంలో సమిష్టి కృషితో అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ ఛైర్మన్ సుబ్బారెడ్డి, డీఎల్సీవో సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.