సిలిండర్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
WNP: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ప్రజలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజల డిమాండ్ మేరకు సకాలంలో సిలిండర్ల సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం వనపర్తి జిల్లాలోని రాజనగరంలో ఉన్న గ్యాస్ గోదామును ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ సిలిండర్ల సరఫరా విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు.