వచ్చే వారం రాష్ట్రానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

వచ్చే వారం రాష్ట్రానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

TG: రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వచ్చే వారం హైదరాబాద్ రానున్నారు. 16న నగరానికి రానున్న రాధాకృష్ణన్.. రాజ్‌భవన్‌లో గవర్నర్ అందించే తేనీటి విందు స్వీకరిస్తారు. అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 21న ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళామహోత్సవ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్‌గా పాల్గొంటారు.