సీసీఐ కేంద్రాలు మూత.. ప్రైవేటు వ్యాపారుల దోపిడీ
నల్గొండలో సీసీఐ కేంద్రాలు మూతపడడంతో ప్రైవేట్ వ్యాపారులు అదుపు తప్పుతున్నారు. 25 జిన్నింగ్ మిల్లుల్లో 9 మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నాయి. “ఇక కొనుగోళ్లు ఉండవు, ఆలస్యంతో నష్టపోతారు” అంటూ.. రైతులను భయపెట్టి, ప్రభుత్వ మద్దతు ధర రూ.8,110 ఉన్నా నాణ్యమైన పత్తిని కూడా కేవలం రూ.5 వేలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు వేదన వ్యక్తం చేస్తున్నారు.