ఆటో టైర్ పేలి పదిమందికి గాయాలు

KRNL: వెల్దుర్తి నేషనల్ హైవేపై బుధవారం ఆటో టైర్ పేలి బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఘటనలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు బేతంచర్ల మండలం యాంబాయి, రుద్రారం గ్రామస్థులుగా గుర్తించారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డోన్‌లో వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదాన్ని గమనించి, క్షతగాత్రులను 108లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.