'శాంతి భద్రత పర్యవేక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి'
SRCL: శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని చందుర్తి ఎస్సై రమేష్ అన్నారు. చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్తుపదార్థాల దుర్వినియోగంపై అవగాహన కల్పించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు.