అవనిగడ్డలో ఘనంగా రామోజీరావు జయంతి కార్యక్రమం
కృష్ణా: మీడియా దిగ్గజం స్వర్గీయ చెరుకూరి రామోజీరావు జయంతిని అవనిగడ్డ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అనేక రంగాల్లో సంస్థలను స్థాపించరని పేర్కొన్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆయన దార్శనికత చిరస్మరణీయం అని కొనియాడారు.