ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆర్డీఓ పర్యటన

ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆర్డీఓ పర్యటన

VSP: ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ముంపు ప్రభావిత ప్రాంతమైన భీమిలి మండలం మంగమారిపేటలో ఆర్డీవో సంగీత్ మాధుర్, తహశీల్దార్ రామారావు పర్యటించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితులను, తుఫాన్ షెల్టర్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజల సమస్యలను  అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.