దయచేసి రోడ్డు వేయండి అంటూ ఫ్లెక్సీ..!

దయచేసి రోడ్డు వేయండి అంటూ ఫ్లెక్సీ..!

MDCL: వర్షాల కారణంగా ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. దీంతో రోడ్ల దుస్థితిపై ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఫొటోలతో దయచేసి ఉప్పల్‌లో రోడ్డు వేయండి అంటూ పిల్లర్‌పై ప్లెక్సీ ప్రదర్శించారు. ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.