మొయినాబాద్‌లో దొంగల బీభత్సం
HYD: నగరంలో రోజురోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. మొయినాబాద్ పరిధిలోని అమ్దాపూర్‌లో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు 16 తులాల బంగారం, రూ. 10 లక్షల నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.