హత్య కేసు.. జీవిత ఖైదు విధించిన జడ్జీ
ADB: భూవివాదం నేపథ్యంలో జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధించిన ఘటన జిల్లాలో నెలకొంది. 2023లో ఇచ్చోడ మండలం 7 నంబర్ గ్రామానికి చెందిన వనోలే సూర్యకాంత్, పాండురంగ్ కలిసి ఈశ్వరరావును హత్య చేశారు. ఈ నేరం నిరూపన కావడంతో జిల్లా జడ్జి ప్రభాకర్ రావు జీవిత ఖైదు, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించారు.