అవుకు మండలంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

అవుకు మండలంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

KRNL: అవుకు మండలం చెర్లోపల్లె గ్రామ సమీపంలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో రాముడు అనే వ్యక్తి మృతి చెందాడు. చెర్లోపల్లి గ్రామం వద్ద బులోరా వాహనం ఆటోను ఢీకొనగా ఆటోలో ప్రయాణిస్తున్న రాముడుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ కోలుకోలేక మృత్యువాత పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.