'రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా ఉండాలి'
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల సంఘం, కాగ్ వంటి రాజ్యాంగ సంస్థలు రాజకీయాలకు అతీతంగా, స్వయంప్రతిపత్తితో పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న అన్నారు. పట్నాలోని లా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ జవాబుదారీతనాన్ని పర్యవేక్షించే ఈ సంస్థలు స్వతంత్రంగా ఉన్నప్పుడే వ్యవస్థ బాగుంటుందని ఆమె స్పష్టం చేశారు.