VIDEO: శ్రావణ మాస బుధవారం ప్రత్యేక పూజలు
JN: శ్రావణ మాసం బుధవారం సందర్భంగా పాలకుర్తి మండలంలోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి గురు పండితులు దేవగిరి సునీల్ శర్మ వేదమంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి దర్శనం చేసుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో మార్మోగింది.