టీడీపీ నేత మృతి పట్ల మంత్రుల సంతాపం

AP: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు కన్నుమూశారు. బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రాయచోటి ఎమ్మెల్యే, రాజంపేట ఎంపీగా ఆయన సేవలందించారు. కాగా పాలకొండ్రాయుడు మృతి పట్ల మంత్రులు బీసీ జనార్ధన్‌రెడ్డి, మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి సంతాపం తెలియజేశారు.