సీఎం దూరదృష్టిని మోదీ ప్రశంసించారు: మంత్రి

AP: నిన్న జరిగిన అమరావతి కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారని మంత్రి పార్థసారధి వెల్లడించారు. సీఎం పనితీరు, దూరదృష్టిపై ప్రధాని మోదీ ప్రశంసించారన్నారు. రాష్ట్ర యువత కలలను అమరావతి నిజం చేస్తుందని మెదీ చెప్పారన్నారు. దేవతల రాజధాని అమరావతి అని ఆయన ప్రశంసించారన్నారు. గత పాలకులు అమరావతిని విధ్వంసం చేశారని పార్థసారధి విమర్శించారు.