'సర్పంచ్ రిజర్వేషన్లకు నేడు డ్రా'

'సర్పంచ్ రిజర్వేషన్లకు నేడు డ్రా'

SRPT: మునగాల మండలంలోని సర్పంచ్ పదవుల రిజర్వేషన్ల కోసం డ్రా నిర్వహించేందుకు నేడు కోదాడ ఆర్డీవో కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ శనివారం ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్డీవో సూర్యనారాయణ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండలంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు తప్పక హాజరుకావాలని కోరారు.