రిజర్వాయర్ నీటి విడుదల

రిజర్వాయర్ నీటి విడుదల

AKP: రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కళ్యాణపులోవ రిజర్వాయర్ నుంచి సోమవారం సాయంత్రం 100 క్యూసెక్కుల నీటిని రెండు గేట్ల ద్వారా బయటికి విడుదల చేశారు. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 460 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 459 అడుగులకు నీటిమట్టం చేరుకోవడంతో విడుదల చేసామని ఏఈ సత్యనారాయణ దొర తెలిపారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 147 క్యూసెక్కులుగా ఉందని పేర్కొన్నారు.