VIDEO: శివాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ
HNK: నడికూడ మండలం రామకృష్ణాపురం గ్రామంలో శివాలయం దేవాలయం నిర్మాణం కోసం శుక్రవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, ఆలయం గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మిక విలువల పెంపకానికి కీలకంగా ఉంటుందని, సకాలంలో నిర్మాణం పూర్తయ్యేలా అధికారులు, గ్రామస్తులు సమన్వయంగా పని చేయాలని సూచించారు.