జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన సీపీ

జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన సీపీ

KMM: కూసుమంచి మండలం నాయకన్ గూడెం చెక్ పోస్ట్, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్ క్రాస్ రోడ్ లో గల జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ నెల 13న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో డబ్బు, మద్యం అక్రమ రవాణ జరుగకుండా పోలీస్ సిబ్బంది గట్టి నిఘా ఉంచాలని తెలిపారు. సరిహద్దు ఇరువైపులా వచ్చి పోయే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు.