ఈ మండలాల్లో నీటి సరఫరా బంద్.!
VKB: ఈనెల 7వ తేదీ వరకు తాండూరు, పెద్దముల్, బషీరాబాద్, యాలాల, దారూర్ మండలాల్లోని గ్రామాలతో పాటు తాండూరు పురపాలికకు డిమాండ్ తగ్గట్లు తాగునీరు సరఫరా కాదని మిషన్ భగీరథ గ్రిడ్ డీఈఈ విజయ్ కుమార్ నిన్న తెలిపారు. వేలూరు సెగ్మెంట్‌లో పంపుల మరమ్మతులు, నిర్వహణ కారణంగా ఇబ్బందులు తప్పవన్నారు. ఆయా గ్రామాల ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.