లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

గుంటూరు: జిల్లాలో సెప్టెంబర్ 14వ తేదిన అన్ని కోర్టులలో జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ జరుగుతుందని కక్షిదారులు త్వరతగతిన కేసులు పరిష్కారం కొరకు సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. లోక్‌ అదాలత్‌ కార్యక్రమం గురించి కక్షిదారులకు అవగాహన కల్పిస్తూ ఇరు పక్షాల వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఎస్పీ సూచించారు.